సర్వేపల్లి ప్రజలకు అండగా ఉంటాం: కాకాణి
NLR: వెంకటాచలం, ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పర్యటించారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకట శేషయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భోజన సదుపాయాలను పరిశీలించారు. అవసరమైన ప్రతి చోటా భోజనాలు సిద్ధంగా ఉంచామని స్థానిక ప్రజలకు తెలియజేశారు. అధికారం ఉన్నా, లేకున్నా సర్వేపల్లి ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలుస్తామన్నారు.