'రక్షణ చట్టాన్ని పట్టించుకోని ప్రభుత్వాలు'

VZM: భారత దేశంలోని అన్నివర్గాల ప్రజలకు పూర్తి స్థాయిలో అండగా నిలిచే వినియోగదారుల హక్కుల రక్షణ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరు కార్చే ప్రయత్నాలు చేస్తున్నాయని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పౌర వేదిక కార్యాలయంలో వినియోగదారుల రక్షణ చట్టం దాని ఉపయోగాలు అనే కరపత్రాలను విడుదల చేశారు.