అంబులెన్స్ లో డెలివరీ తల్లి బిడ్డ క్షేమం
MDK: పాపన్నపేట మండలం యూసఫ్పేట్ గ్రామానికి చెందిన సుకన్య అంబులెన్స్ లో బిడ్డకు జన్మనిచ్చారు. సోమవారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువకావడంతో కుటుంబీకులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ శ్రీహరి నార్మల్ డెలివరీ చేశారు. తల్లిబిడ్డను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు అంబులెన్స్ పైలట్ నరేశ్ తెలిపారు.