ధాన్యం అమ్మకానికి రైతుల అవస్థలు

ధాన్యం అమ్మకానికి రైతుల అవస్థలు

MBNR: మహబూబ్‌నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో లోడ్ వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనే నాథుడే లేడని రైతులు వాపోతున్నారు. పంటను పండించిన దాని కంటే దానిని అమ్మడానికే ఎక్కువగా కష్టపడుతున్నామని చెబుతున్నారు.