పారిశుద్ధ్య పనుల్లో పంచాయతీ కార్మికులు

పారిశుద్ధ్య పనుల్లో పంచాయతీ కార్మికులు

NZB: ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చందూరు పంచాయతీ కార్మికులు గురువారం మురికి కాలువలను శుభ్రం చేస్తున్నారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, గ్రామం పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేస్తున్నారు. కార్మికుల కృషిని చూసిన గ్రామస్తులు వారిని అభినందించారు. గ్రామం పరిశుభ్రంగా ఉండటానికి ప్రధాన కారణం పంచాయతీ కార్మికులే అని కొనియాడారు.