సముద్ర గర్భంలో హోం మంత్రి అనితకు బర్త్ డే విషెస్
విశాఖ: హోం మంత్రి వంగలపూడి అనిత జన్మదినం సందర్భంగా టీడీపీ యువ నాయకుడు వాసపల్లి అడవిరాజు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ సాగర తీరంలో స్కూబా డైవింగ్ చేస్తూ, సముద్రపు అడుగున మంత్రి చిత్రపటాన్ని ప్రదర్శించి తన అభిమానాన్ని చాటుకున్నారు. గత ఏడాది సైకత శిల్పంతో విషెస్ చెప్పిన ఆయన, ఈసారి ఇలా సముద్ర గర్భంలో సాహసం చేయడం అందరినీ ఆకట్టుకుంది.