'జర్నలిస్టుల సొంత ఇంటి కల నెరవేరుస్తా'
ELR: అర్హులైన జర్నలిస్టుల సొంత ఇంటి కలను నెరవేరుస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. ఏలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో బడేటి చంటిని కలిసి జర్నలిస్టులు వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉంటానని వారి ఇళ్ల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చూపుతానన్నారు.