పాము కాటుకు రైతు మృతి

పాము కాటుకు రైతు మృతి

VKB: పెద్దేముల్ మండలంలోని జైరాం తండాకు చెందిన పండు నాయక్(55) పంటను కాపాడుకోవడానికి పొలానికి కావలి వెళ్లి పాము కాటుకు ప్రాణాలు కోల్పోయాడు. తన పొలంలో మినుము,పెసర్లు పంటలు వేయగా.. అడవిపందులు పంటను నాశనం చేస్తున్నాయని కావాలి కోసం వెళ్లి తిరిగొచ్చే మార్గమధ్యలో రైతును పాము కాటు వేసింది. అతన్ని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.