జిల్లా స్పెషల్ వంటకం ‘ఉగ్గాని’

జిల్లా స్పెషల్ వంటకం ‘ఉగ్గాని’

ATP: సాధారణంగా ఒక్కో ప్రాంతానికి ఒక్కో వంటకం ఫేమస్. అలా జిల్లాలో ఉగ్గాని ఒకటి. చాలా మంది బ్రేక్​ఫాస్ట్‌లో ఉగ్గాని, బజ్జీలతో కలిపి తినడానికి ఇష్టపడుతుంటారు. జిల్లాలో ఉదయాన్నే ఎక్కడ ఏ టిఫిన్ సెంటర్‌కి వెళ్లిన ఉగ్గాని బజ్జీ మాత్రం కచ్చితంగా లభిస్తుంది. ఈ ఉగ్గాని రెసిపీ వేడివేడి మిర్చీ బజ్జీలతో ఎంతో రుచిగా ఉంటుంది. చిన్న పిల్లలు సైతం ఇష్టంగా తింటారు.