విజయవాడలో నేడు జగన్ పర్యటన
NTR: మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి బుధవారం విజయవాడలో పర్యటించనున్నారు. గ్రంథాలయ పరిషత్ మాజీ ఛైర్మన్ జమ్మలపూర్ణమ్మను పరామర్శించేందుకు ఆయన బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:20 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన గుణదల బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా ఒంటిగంటకు లోటస్ ల్యాండ్మార్క్‌కు చేరుకుంటారని వైసీపీ కార్యాలయం వెల్లడించింది.