చిన్నారి ప్రాణాలు తీసిన చిప్స్ ప్యాకెట్

చిన్నారి ప్రాణాలు తీసిన చిప్స్ ప్యాకెట్

చిప్స్ ప్యాకెట్‌లో వచ్చిన చిన్న ప్లాస్టిక్ బొమ్మ నాలుగేళ్ల బాలుడు ప్రాణం తీసింది. ఒడిశాలోని  దరింగ్‌బాడిలో ఈ ఘటన జరిగింది. బాలుడు చిప్స్ తింటుండగా, ఆ ప్యాకెట్‌లో వచ్చిన చిన్న బొమ్మ తుపాకీని చిప్స్ అని భావించి తినేందుకు ప్రయత్నించాడు. అయితే అది గొంతులో ఇరక్కుపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా శ్వాస ఆడక బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.