సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

SRPT: కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి, 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం అంగుళం సుద్ధ మొక్కలపై స్వాతంత్య్ర సమరయోధుల ప్రతిమలను చెక్కి తన దేశభక్తిని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో అనేక రకాలైన సూక్ష్మ వస్తువులపై పలువురి ప్రతిమలు చెక్కి అందరి మన్ననలు పొందాడు.