'సహాయం కావాలి'.. అత్యవసర సందేశం!
నల్ల సముద్రంలో విరాట్ అనే రష్యన్ ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి నేపథ్యంలో ట్యాంకర్ సిబ్బంది రేడియా ద్వారా అత్యవసర సందేశం పంపారు. 'ఇది విరాట్. సహాయం కావాలి! డ్రోన్ దాడి! మేడే!' అని సిబ్బంది అంటున్న ఆడియో రికార్డు అయింది. ఈ విషయాన్ని టర్కీ రవాణా మంత్రిత్వ శాఖ కూడా నిర్థారించింది. అయితే విరాట్‌కు స్వల్ప నష్టమే జరిగిందని సమాచారం.