వై జంక్షన్ వద్ద ముమ్మరంగా వాహనాల తనిఖీలు
ఎన్టీఆర్: నందిగామ వై జంక్షన్ వద్ద ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేని వారికి, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులకు భారీగా జరిమానాలు విధించారు. సీఐ వైవీఎల్ నాయుడు మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు.