ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఖమ్మం: దొంగతనాలు జరుగుతున్న క్రమంలో దమ్మపేట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా ఊరికి వెళ్ళేటప్పుడు పోలీసు స్టేషనులో సమాచారం ఇవ్వాలని కోరారు. అదే విధంగా ఎవరైనా అనుమానస్పదంగా కనపడితే వెంటనే పోలీసులకు గాని, డయల్ 100కు సమాచారం అందించాలన్నారు.