ఇరాన్‌పై దాడిని ముందే చెప్పిన గ్రోక్
ఇరాన్‌పై దాడులు ఫిబ్రవరి 28నే జరుగుతాయని 'గ్రోక్' ఏఐ ముందే పసిగట్టి సంచలనం సృష్టించింది. చాట్‌జీపీటీ, జెమినై మార్చిలో జరగొచ్చని అంచనా వేయగా, గ్రోక్ చెప్పిన ఖచ్చితమైన తేదీ నిజమైంది. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. భవిష్యత్తును అంచనా వేయడమే అసలైన మేధస్సు అని కొనియాడారు. టెక్ ప్రపంచంలో గ్రోక్ ప్రదర్శించిన ఈ అద్భుతమైన సామర్థ్యం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.