మార్నింగ్‌ రొటీన్‌పై సమంత వీడియో

మార్నింగ్‌ రొటీన్‌పై సమంత వీడియో

నటి సమంత తన 'పవర్ మార్నింగ్' సీక్రెట్‌ను పంచుకుంది. నిద్రలేవగానే ఫోన్ చూడటం, మెయిల్స్ చెక్ చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరించింది. ఉదయాన్నే ప్రశాంతంగా గడిపితే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని, ఈ అలవాటే తన జీవితాన్ని మార్చిందని చెప్పింది. ఒత్తిడి హార్మోన్లను తగ్గించుకునేందుకు ఈ సింపుల్ ఫార్ములా పాటించాలని సూచించింది.