ఇందిరమ్మ ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

RR: ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్‌లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంలో సాధ్యమైందని పేర్కొన్నారు.