సీఎం రేవంత్ రెడ్డి గెటప్‌లో వినాయకుడు

సీఎం రేవంత్ రెడ్డి గెటప్‌లో వినాయకుడు

TG: రాష్ట్రంలో గణేశ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రకరకాల గెటప్‌లలో గణేశ్‌లు దర్శనమిచ్చాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి గెటప్‌లో కూడా వినాయకుడు కొలువు దీరడం ఈసారి HYD గణేశ్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గోషామహల్ నియోజకవర్గంలో తెలంగాణ రైజింగ్ పేరుతో రేవంత్ గెటప్‌లో వినాయకుడిని రూపొందించారు. ఇది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.