టికెట్ ధరల పెంపు దోపిడీ కాదు: పవన్

టికెట్ ధరల పెంపు దోపిడీ కాదు: పవన్

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ రేట్ల పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ ధరల పెంపును 'దోపిడీ'గా చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సినిమా అనేది ఒక ఎంపిక మాత్రమేనని, థియేటర్‌కు వెళ్లాలా వద్దా అనేది పూర్తిగా ప్రేక్షకుడి ఇష్టమని పేర్కొన్నారు. టికెట్ ద్వారా వచ్చే ప్రతి రూపాయిలో కొంత భాగం పన్ను రూపంలో ప్రభుత్వానికే చేరుతుందని వివరించారు.