'సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి'

'సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి'

ASR: గ్రామ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని కొయ్యూరు డిప్యూటీ MPDO శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం రావణాపల్లి సచివాలయాన్ని తనిఖీ చేసి ముందుగా రికార్డులను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు.