ఈజ్ గావ్ నూతన ఎస్సైగా నరేశ్ బాధ్యతల స్వీకరణ

ఈజ్ గావ్ నూతన ఎస్సైగా నరేశ్ బాధ్యతల స్వీకరణ

ASF: కాగజ్ నగర్ మండలం ఈజ్ గావ్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా నరేశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తూ, సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. నేరాల నివారణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అనంతరం స్టేషన్ సిబ్బందికి విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు.