ఉమ్మడి జిల్లాలో డిఫెన్స్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు

కృష్ణా: ఉమ్మడి కృష్ణా జిల్లాకు రెండు కీలక డిఫెన్స్ ప్రాజెక్టులు రానున్నాయి. నాగాయలంక వద్ద డీఆర్డీవో మిస్సైల్ టెస్టింగ్ కేంద్రం, జగ్గయ్య పేట జయంతిపురం వద్ద బ్రహ్మోస్ క్షిపణుల తయారీ కేంద్రం ఏర్పాటు కానున్నాయి. ఇందుకు అవసరమైన 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమి, జాతీయ రహదారి వంటి సదుపాయాలు ఉండటంతో ఈ ప్రాంతాలు ఎంపికైనట్లు తెలుస్తోంది.