అనుమతి లేని క్లినిక్ మూసివేత

అనుమతి లేని క్లినిక్ మూసివేత

KNR: జమ్మికుంట పట్టణంలో ఓ క్లినిక్‌ను గురువారం డిప్యూటీ డీఎంహెస్ఓ డాక్టర్ చందు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ క్లినిక్ ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్నట్లు గుర్తించి, వెంటనే దానిని మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అర్హత లేని వైద్యుల వద్ద చికిత్స చేయించుకోవద్దని, ప్రభుత్వ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.