అడవి ప్రాంతంలో ఆధార్ కార్డులు లభ్యం

అడవి ప్రాంతంలో ఆధార్ కార్డులు లభ్యం

MDK: కౌడిపల్లి మండలం కుకట్లపల్లి సమీపంలోని అడవిలో గుర్తుతెలియని వ్యక్తులు వందలాది ఆధార్ కార్డులను, వివిధ గ్రామాలకు చేరాల్సిన లెటర్లను పారబోశారు. స్థానిక బట్టెమ్మ దేవాలయానికి వెళ్లే దారిలో ఇవి దర్శనమివ్వడంతో భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇవి ఇక్కడ పారేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఆ కార్డులను సంబంధిత యాజమానులకు చేరవేయాలని కోరారు.