'నీటి పన్ను వసూళ్లపై దృష్టి సారించండి'

WGL: నీటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబంధిత అధికారులు, సిబ్బందితో నీటి పన్ను వసూళ్ల పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మేయర్ పాల్గొని సూచనలు చేశారు. ప్రతి రోజు 300 మంది పన్ను బకాయిదారులను గుర్తించి, వారికి ఫోన్ కాల్స్ చేసి పన్నులు చెల్లించేలా చూడాలని ఆదేశించారు.