రిటైనింగ్ వాల్ పరిసరాలను పరిశీలించిన కమిషనర్

HYD: బంజారాహిల్స్‌లోని అంబేద్కర్ బస్తీలో ఇటీవల కూలిన నాలా రిటైనింగ్ వాల్ పరిసరాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం పరిశీలించారు. ఈ గోడ పడిపోవడంతో వరద తమ ప్రాంతాలను ముంచెత్తుతోందని స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కమిషనర్ పర్యటించారు. ఇప్పటికే రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం అవ్వగా.. త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.