హాంకాంగ్ క్రికెట్ లీగ్: భారత జట్టు ప్రకటన
హాంకాంగ్ క్రికెట్ లీగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం భారత్ తమ జట్టును తాజాగా ప్రకటించింది. దినేశ్ కార్తిక్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్, ప్రియాంక్ పాంచల్ సభ్యులుగా ఉన్నారు. 12 దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రతి జట్టులో ఆరుగురు ఆటగాళ్లు, మ్యాచ్ ఆరు ఓవర్లు మాత్రమే ఉండనుంది.