హరీశ్‌రావు ఆరోపణలు నిరాధారం: కోదండరెడ్డి

హరీశ్‌రావు ఆరోపణలు నిరాధారం: కోదండరెడ్డి

TG: హరీశ్‌రావు చేసిన ఆరోపణలు నిరాధారమని రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి కొట్టిపారేశారు. భూ సమస్యలన్నీ బీఆర్‌ఎస్ తెచ్చిన ధరణి తప్పిదాల వల్లే వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 'భూ భారతి' చట్టం తెచ్చి, సాదాబైనామా క్రమబద్ధీకరణ ప్రారంభించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు హక్కు కల్పించడంలో ధృఢ సంకల్పంతో కృషి చేస్తున్నారని తెలిపారు.