'సంగీతంతో మనసుకు ప్రశాంతత'
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి నిర్వహించిన కళా ఉత్సవాన్ని కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగీతం మానసిక ప్రశాంతతను అందిస్తుందని, విద్యార్థులు విశ్వవిద్యాలయానికి అంబాసిడర్లుగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అన్నవరపు రామస్వామిని సత్కరించారు.