డీఈవోగా నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరణ
కోనసీమ: జిల్లా విద్యాశాఖ అధికారిగా నాగేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విద్యాశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన బదిలీపై జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యా ప్రమాణాలలో జిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలని కలెక్టర్ నూతన డీఈవోకు సూచించారు.