వైద్యుల గైర్హాజరుపై కలెక్టర్ సీరియస్
SRPT: హుజూర్ నగర్ ఆసుపత్రిని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో డ్యూటీ సమయం ముగియక ముందే డాక్టర్లు వెళ్లిపోవడంపై సీరియస్ అయ్యారు. సమయపాలన పాటించని ఓపీ విభాగం డాక్టర్లు, కాంట్రాక్ట్ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. విధుల నిర్వహణ పట్ల అలసత్యం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.