బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో కుంకుమార్చనలు

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి వద్ద భక్తులు కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన పూజలు చేసి తరించారు. అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూ. 300 టికెట్‌తో కుంకుమార్చన పూజలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. రాత్రి 8:30 వరకు టికెట్స్ అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు.