'ఉచిత పార్కింగ్ జీవోను అమలు చేయాలి'
విశాఖలోని మల్టీప్లెక్సులు, షాపింగ్ మాల్స్‌లో జీవో నెం.44ను కట్టుదిట్టంగా అమలు చేయాలని అడ్వకేట్ కొండా రాజీవ్ గాంధీ డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. మొదటి 30 నిమిషాలు, బిల్లు ఉంటే గంట వరకు పార్కింగ్ ఉచితమన్న నిబంధన ఉన్నా, యజమాన్యాలు అక్రమంగా వసూలు చేస్తున్నారన్నారు. ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాన్నారు.