ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి సన్మానం

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి నాగర్ కుంట నవీన్ రెడ్డి విజయ ఢంకా మోగించిన సంధర్బంగా బుధవారం పార్టీ నేతలు ఆయనను ఘనంగా సన్మానించారు. నందిగామ మండలంలోని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు రఘునాథ్ యాదవ్‌తో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.