క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే చర్యలు తప్పవు: ఎస్పీ
ప్రకాశం: గత కొద్దిరోజులుగా క్రికెట్ బెట్టింగ్లపై ప్రత్యేక పోలీస్ బృందాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఇటీవల దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న7 గురుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ చట్ట వ్యతిరేకమని ఎస్పీ హెచ్చరించారు.