CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ

PLD: నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శుక్రవారం 57 మంది లబ్ధిదారులకు రూ.74,15,564 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. వైద్య ఖర్చులు భరించలేని పేద ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ప్రజల ఆరోగ్య రక్షణే తమ ప్రధాన కర్తవ్యమన్నారు. లబ్ధిదారులలో ఒకరైన తోట మహాలక్ష్మీకి రూ.6 లక్షల చెక్కును అందజేశారు.