కురిచేడు మండల తెదేపా నేత హఠాన్మరణం

కురిచేడు మండల తెదేపా నేత హఠాన్మరణం

ప్రకాశం: దర్శి నియోజకవర్గ పరిధిలోని కురిచేడు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం గురునాథం ఆకస్మికంగా గుండెపోటుతో ఆదివారం సాయంత్రం మరణించారు. సాయంత్రం బీపీ తక్కువగా ఉండటంతో వినుకొండలోని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దర్శి తెదేపా ఇన్‌ఛార్జ్‌ లక్ష్మీ గురునాథం మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.