పల్నాటి వీరారాధనలో రాయబారం ఘట్టం

పల్నాటి వీరారాధనలో రాయబారం ఘట్టం

PLD: కారంపూడి సమీపంలో గురువారం పల్నాటి వీరారాధనోత్సవాల్లో రాయబారం ఘట్టం నిర్వహించారు. మాచర్ల రాజ్యం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బ్రహ్మన్న, మలిదేవరాజు కలిసి రాయబారిని పంపే సన్నివేశాన్ని ప్రతిరూపంగా చూపించారు. రాయబారిగా బాలరాజు, అంగరక్షకుడిగా కన్నమదాసు ఎంపికైన ఘట్టం ఆకట్టుకుంది. వీర దేవాలయంలో కళాకారులు పల్నాటి చరిత్రను ఆలపించారు.