అల్లం అతిగా వాడుతున్నారా..?
అల్లం ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అయితే రుచి కోసం అతిగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తీసుకుంటే గుండెల్లో మంట, విరేచనాలు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అలాగే రక్తం పల్చగా అయ్యే ప్రమాదం ఉందని.. షుగర్, బీపీ మందుల ప్రభావం తగ్గిపోతుందని సూచిస్తున్నారు. అలెర్జీ కూడా తలెత్తే అవకాశముందని అంటున్నారు.