స్విగ్గీ, జొమాటో రైడర్ల ధర్నా

VSP: స్విగ్గీ, జొమాటో డెలివరీ రైడర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిలా కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లాలో సుమారు 40,000 మంది వర్కర్లు ఉన్నప్పటికీ, వారికి ఎలాంటి ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం లేదా సామాజిక భద్రత లేదని వారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.