ఈనెల 14న ఎల్లారెడ్డిలో మెగా రక్తదాన శిబిరం

ఈనెల 14న ఎల్లారెడ్డిలో మెగా రక్తదాన శిబిరం

KMR: ఈనెల 14వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మైనారిటీ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్లారెడ్డి ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు గాయాజుద్దీన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు నేడు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.