పొన్నూరులో ఇద్దరు పోలీసులు సస్పెండ్
గుంటూరు: పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న నాగార్జున, మహేష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం సస్పెండ్ చేశారు. అక్రమ రేషన్ రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారికి సహకరిస్తూ, పోలీస్ నిఘా సమాచారాన్ని వారికి చేరవేశారని ఎస్పీ తెలిపారు. అక్రమ వ్యాపారస్తులకు సహకరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.