నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రకాశం: కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు పరిధిలో విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఆ శాఖ ఏఈ రమేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ పరిధిలోని లైన్ రిపేర్ కారణంగా గొట్లగట్టు పరిధి గ్రామాల్లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంటు ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.