ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జడ్పీ ఛైర్మన్
VZM: మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలన్నారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు.