VIDEO: రాజమండ్రిలో పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు

VIDEO: రాజమండ్రిలో పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు

E.G: రాజమండ్రి నగరం కంబాల చెరువు భావన ఋషి టెంపుల్ పక్క వీధిలో మంగళవారం పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి. అసలే వేసవికాలం కావడంతో వినియోగదారులు విద్యుత్‌ను అధిక సంఖ్యలో వినియోగిస్తారు. విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో మున్సిపల్ ఆదాయానికి గండి పడుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని పట్టపగలు దీపాలను ఆపాలని కోరుతున్నారు.