VIDEO: పుంగనూరులో యోగాంధ్ర ర్యాలీ

CTR: పుంగనూరు పురపాలక పరిధిలో యోగాంధ్ర కార్యక్రమాన్నిపురపాలక కమిషనర్ మధుసూదన్ రెడ్డి మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ఇందిర కూడలి నుంచి MBT రోడ్డు మీదగా NTR సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. సర్వరోగ నివారణగా యోగాను జీవితంలో ఓ భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో CI సుబ్బరాయుడు, డాక్టర్ గౌరీ శ్రీ, టీడీపీ నేత సీవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.