పీఎసీఎస్ నూతన అధ్యక్షురాలిగా మాధవి

SKLM: రైతులకు సక్రమంగా సేవలు అందజేయడమే పీఎసీఎస్ లక్ష్యమని ఎమ్మెల్యే సతీమణి, మాజీ ఎంపీపీ కూన ప్రమీల అన్నారు. కృష్ణాపురం పీఎసీఎస్ అధ్యక్షురాలుగా నియమితులైన సిమ్మ మాధవి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో రుణాలు అందజేసి, రైతు సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు.