పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
JGL: రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో గురువారం మండల పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా 85 గోజాతి, 152 గేదె జాతి పశువులకు టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొడిపెల్లి రాజవ్వ, ఉప సర్పంచ్ వేల్పుల భూమేశ్, పాడి రైతులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.