పోలింగ్ బూత్లను పరిశీలించిన ఆర్డిఓ

నిజామాబాద్: బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో శుక్రవారం ఆర్డిఓ రమేష్ రాథోడ్ పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓటర్లకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వరప్రసాద్, ఎంపిఓ సత్యనారాయణరెడ్డి , పంచాయతీ కార్యదర్శి భరత్ , గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.